Entertainment తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్. ముఖ్యంగా ఆమె లవ్ లైఫ్ విషయంలో ఎప్పుడూ హాట్టాపిక్ గా మారుతుంది..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ ఏదో ఒక విషయంతో నిత్యం మాత్రలు నిలుస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.. ఇప్పటికే పలువురు వ్యక్తులతో రిలేషన్షిప్ మెయిన్టెయిన్ చేసినట్లు జోరుగా ప్రచారం సాగగా.. వీరిలో యంగ్ హీరోలు ఇషాన్ ఖట్టర్, కార్తిక్ ఆర్యన, ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జాన్వి చిన్నప్పటి స్నేహితులు ఒర్హాన్, అక్షత్ రంజన్, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిందే మనవడు శిఖర్ పహారియా సహా పలువురు పేర్లు వినిపించాయి. అయితే వీటన్నిటిలో ఏ విషయం పైన ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు.. కానీ వారితో కలిసి ఆమె పార్టీలు, డిన్నర్‌లు, విదేశీ టూర్‌లు.. అంటూ ఒకరి తర్వాత మరొకరితో షికార్లు చేశారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ప్రస్తుతం జాన్వీ సినిమాల్లోకి రాకముందు మెయిన్ టెయిన్ చేసిన మాజీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.. నిర్మాత, రచయిత అమృత్ పాల్ బింద్రా నివాసంలో ఇటీవలే జరిగిన దిపావళీ వేడుకల్లో ఈ ఇద్దరు కలిసి సన్నిహితంగా దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. అంతే కాకుండా ఒర్హాన్ ఏర్పాటు చేసిన హలోవీన్ వేడుకల్లో వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. దీంతో వీరిద్దరు మళ్లీ ప్రేమలో పడ్డారనే అనుమానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు జాన్వి. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు..