చర్లపల్లి పీఎస్ తాత్కాలిక భవనాన్ని పరిశీలించిన సీపీ
రాచకొండ కమిషనరేట్ పరిధిలో చర్లపల్లిలో ఏర్పాటు కానున్న నూతన పొలీస్ స్టేషన్ తాత్కాలిక భవనాన్ని ఈరోజు రాచకొండ సీపీ డిఎస్ చౌహన్ ఐపిఎస్ గారు పరిశీలించారు. చర్లపల్లి ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మంజూరు చేసిన నూతన పొలీస్ స్టేషన్ ద్వారా ప్రజా సమస్యలకు సత్వర న్యాయం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నూతన పొలీస్ స్టేషన్ త్వరలో ప్రారంభోత్సవం జరుగతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గారి వెంట డీసీపీ మల్కాజి గిరి జానకి ఐపిఎస్, కుషాయిగూడ ఎసిపి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

























