Siddu Jonnalagadda : డీజే టిల్లుతో టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీసి మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన భాస్కర్.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ సిద్దుతో ప్లాన్ చేశాడట. ఆల్రెడీ ఈ మూవీ స్టోరీ సిట్టింగ్స్ కూడా పూర్తి అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వారంలోనే ఈ మూవీ పూజ కార్యక్రమాలతో లాంచ్ కానుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, ఆడియన్స్ మాత్రం ఈ కాంబినేషన్ ఆసక్తి చూపిస్తున్నారు. భాస్కర్ తెరకెక్కించే చిలిపి ప్రేమకథలకు సిద్దు లాంటి హీరో తోడైతే వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. మరి ఈ కాంబినేషన్ నిజంగానే సెట్స్ పైకి వెళ్తుందా? లేదా రూమర్స్ తోనే నిలిచిపోతుందా? అనేది చూడాలి. కాగా సిద్దు ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్నాడు
రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన డీజే టిల్లుకి ఇది సీక్వెల్ గా వస్తుండడంతో మూవీ పై భారీ బజ్ నెలకుంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయ్యింది. రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి హీరో సిద్ధు కథ, మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతుంది.