హీరోలూ, హీరోయిన్లూ ఎంతోమంది వస్తుంటారు. వారిలో కొందరు నిలదొక్కుకుంటారు, ఎందరో కనుమరుగై పోతూంటారు. నటించినంతకాలం కూడా ఎప్పటికీ నిలిచిపోయే పాత్రల్ని పోషించేవారు కొందరైతే, అంతగా గుర్తింపు లేని పాత్రలతో కాలం వెళ్లబుచ్చేవారు ఇంకొందరు. అయితే, వరుసగా గుర్తుండిపోయే పాత్రల్ని పోషించే అవకాశాలు అందరికీ దక్కవు. అలాంటి అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, పత్రలకు తగిన అభినయ సామర్థ్యాన్ని కనబరుస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న నటి… సాయి పల్లవి. నిజానికి ‘ఢీ’ కార్యక్రమంలో డాన్స్ చేసి విజేతగా గుర్తింపు పొంది ఆ తర్వాత వెండితెరపైకి వచ్చిన సాయి పల్లవికి అదృష్టవశాత్తూ పోషించే ప్రతి పాత్రా చక్కని గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. సాయి పల్లవికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
సాయి పల్లవి కార్డియాలజిస్ట్ కావాలనుకుంది. ఇటీవల జార్జియాలో మెడిసిన్ కూడా పూర్తి చేసింది. ‘ప్రేమమ్’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘మలారే…’ తన మీద చిత్రీకరిస్తాని ముందుగా తెలియదు. కానీ, ఆ పాటలో కనిపించబోయేది తానే అని తెలిసిన తరువాత చాలా సంతోషించిందట. ‘ప్రేమమ్’ సినిమా కోసం అల్ఫోన్స్, సాయి పల్లవిని సంప్రదించినప్పుడు, సపోర్టింగ్ రోల్స్ కోసమని భావించింది సాయి పల్లవి. ఇక సాయి పల్లవికి సంబంధించిన మరో ఆసక్తి కరమైన విషయమేంటంటే, తను తమిళనాడులోని కోటగిరి ప్రాంతానికి చెందిన బడగా కమ్యూనిటీకి చెందిన యువతి. ఆ కమ్యూనిటీలో ఆ స్థాయి స్టార్‌డమ్ సాధించిన మొదటి మహిళ సాయి పల్లవే. అందరూ భావించినట్టుగా సాయి పల్లవి మలయాళీ కాదు, ఆమె తమిళనాడుకు చెందింది. ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకోవటం, రంగోళీలు దిద్దటం సాయిపల్లవికి ఎంతో ఇష్టం.