ప్రముఖ సినీ నృత్య దర్శకులు రాకేష్ మాస్టర్ గారి సంతాప సభా కార్యక్రమం వారి శిష్యులు డాన్స్ మాస్టర్ శేఖర్ మరియు సత్యా గార్ల ఆధ్వర్యంలో యూసుఫ్ గూడ ,మెహమూద్ ఫంగషన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో FDC చైర్మన్ అనిల్ కూర్మచాలం గారు మరియు అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ గారు మరియు ప్రముఖ దర్శకులు వైవిఎస్. చౌదరి గారు దర్శకులు బాబ్జి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని , జనరల్ సెక్రెటరీ దొరై ట్రెజరర్ సురేష్, టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు రాకేష్ , జనరల్ సెక్రటరీ విజయ్ ట్రెజరర్ నరేందర్ రెడ్డి, టీవీ ఫెడరేషన్ ఫౌండర్ అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ గారు వెంకట్ యాదవ్ మరియు డ్యాన్స్ మాస్టర్లు, డాన్సర్స్ మరియు రాకేష్ మాస్టర్ గారి కుటుంబసభ్యులు హాజరైన ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు యస్.ఏ.ఖుద్దూస్ గారి సభా ధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2.000మందికి భోజన సదుపాయం ఏర్పాటు చెయ్యడం… హర్షించతగ్గ విషయం.