Viral Video సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏం జరిగినా అది ఒక పెద్ద విశేషం అయిపోతుంది.. ఎక్కడ ఏం జరిగినా వీడియో రూపంలో క్షణాలలో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇలాంటి వైరల్ వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటున్నాయి.. చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు చేసే చేష్టల కోసం చెప్పనే అక్కర్లేదు.. వీటిని చూసిన వాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోతుంటారు.. ఒత్తిడి నుండి బయటపడటానికి ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడతాయి.. అయితే ఇదే జాబితాలో చేరిపోయింది ప్రస్తుతం ఓ బొమ్మ చేసిన పని.. తాజాగా జరిగిన ఇలాంటి ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
రాత్రి సమయంలో ఓ వ్యక్తి ముసుగు వేసుకొని ఏటీఎం ముందు నిల్చుని ఉన్నాడు.. గంటల తరబడి అక్కడే నిలుచుని ఉన్నాడు.. చాలా సేపటి నుంచి అతన్ని గమనిస్తున్న.. ఎంతకీ అతను అక్కడి నుంచి కదలడం లేదు. చూసి చూసి చుట్టూ ఉన్నవాళ్లంతా అసలు ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటే.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు.. అచ్చం మనిషి లాగా ముసుగు వేసుకొని ఏటీఎం ముందు గంటల తరబడి నిలబడిన ఆ వ్యక్తి మనిషి కాదు.. కేవలం ఒక బొమ్మ. పక్క ఏటీఎం కి వచ్చిన ఒక మనిషి ఇదంతా చూసి ఆ బొమ్మని కదిలించగా బొమ్మ అన్న విషయం బయటపడింది. దూరం నుంచి దీన్ని వీడియో తీస్తున్నా వాళ్లు అసలు విషయం తెలుసుకొని నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ విషయం ఎక్కడ జరిగిందో మాత్రం క్లారిటీ లేదు. ఇది చూసిన వాళ్లంతా అమ్మో బొమ్మే కదా దయ్యమేమో అనుకొని భయపడి చచ్చాం అంటూ కామెంట్లు పెడుతున్నారు..
Man leaves a mannequin outside a Tesco cashpoint 😭 pic.twitter.com/CgYtG372RK
— UB1UB2 West London (Southall) (@UB1UB2) September 30, 2022