Viral Video : సైంటిస్టులు.. కొత్త విషయాలని తెలియజేస్తూ కొత్త వాటిని ఆవిష్కరిస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో దీనికి భిన్నమైన సంఘటన జరిగింది. ఓ పువ్వులు అమ్ముకునే వ్యక్తి… ఓ అద్భుతమైన వస్తువును కనిపెట్టాడు. దాని వల్ల తనను ఇబ్బంది పెడుతున్న ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నాడు.
లఖింపూర్ ఖేరీ జిల్లాలోని లల్లూరామ్ (77) అనే వ్యక్తి పువ్వులు విక్రయించి జీవిస్తాడు. అయితే మండే ఎండల్లో రోజూ పువ్వులు అమ్ముకోవడం తనకు కష్టంగా ఉండేది. దానివల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఆ వేడి నుంచి ఎలాగైనా ఉపశమనం పొందాలనుకున్నాడు. బాగా ఆలోచించి.. తనకు చల్లదనాన్ని ఇచ్చే వస్తువును కనిపెట్టి.. దానిని నెత్తి మీద పెట్టుకుని రోజూ పువ్వులు అమ్ముకుంటున్నాడు. ఆయన తలపైనే రోజూ ఫ్యాన్ తిరుగుతుంది. తను ధరించే హెల్మెట్‌పై చిన్న సోలార్ ప్యానెల్, చిన్న ఫ్యాన్‌ను అమర్చాడు. ఎండ వేడిని ఇంధనంగా మార్చుకుని.. ఆ ఫ్యాన్ నిత్యం తిరుగుతుంది. దాంతో లల్లూరామ్‌కు ఎండ వేడి నుంచే చల్లదనం పుట్టుకొస్తుంది.
ఈ వస్తువును తయారు చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఒక్కొక్కరి నుంచి ఒక్కో వస్తువుని తీసుకుని.. ఈ హెల్మెట్‌ను తయారు చేసినట్టు లల్లూరామ్ చెప్పాడు. “నేను అనారోగ్యానికి గురయ్యాను. ఏ వస్తువును కొనలేని స్థితిలో ఉన్నాను. ఒకరి నుంచి సోలార్ ప్యానెల్, మరొకరి నుంచి పోర్టబుల్ ఫ్యాన్, మరొక స్నేహితుడి నుంచి హెల్మెట్ తీసుకున్నాను” అని అతను చెప్పాడు. ఈ పోర్టబుల్ ఫ్యాన్ వల్ల వేడి నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని చెప్పాడు. లల్లూరాం రోజూ ఇంటింటికీ వెళ్లి పువ్వులు అమ్ముతాడు. ఆ డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
देख रहे हो बिनोद सोलर एनर्जी का सही प्रयोग
सर पे सोलर प्लेट और पंखा लगा के ये बाबा जी कैसे धूप में ठंढी हवा का आनंद ले रहे है ! pic.twitter.com/oIvsthC4JS
— Dharmendra Rajpoot (@dharmendra_lmp) September 20, 2022