అప్పుడప్పుడూ సరదాగా ఫ్రెండ్స్ తో కలసి మందు పార్టీ చేసుకునేవాళ్లు కొందరుంటారు. ఇంకొందరు ప్రతిరోజూ చీకటి పడుతూనే చుక్కతో గొంతును తడుపుకుంటారు. మరికొందరు రోజులో ఎక్కువ సమయాన్ని మందేయడానికే కేటాయిస్తారు. ఏదేమైనా, మందుబాబులకు మందిచ్చే కిక్కే వేరప్పా…! మనుషులు మందేస్తే అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ, కోతి మందేస్తే…?! ఆశ్చర్యపోవాల్సిందే. మందేయడమే కాదు, మద్యానికి బానిసైన ఓ వానరం వ్యాపారులకు, వినియోగదారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లాలో ఈ వానరం చేస్తున్న ఆగడాలను స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. అది బీరు క్యాన్‌ను గటగటా తాగేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని లాక్కుంటున్న ఈ వానరం.. ఎదరిస్తే మాత్రం తిరగబడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దాని దాడులకు భయపడుతున్న వినియోగదారులు మద్యం దుకాణానికి వెళ్లడం మానేస్తున్నారు. కోతి ఆగడాలపై మద్యం వ్యాపారులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుకున్న జిల్లా ఎక్సైజ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ…
అటవీ అధికారుల సాయంతో కోతిని బంధించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా, లక్నో-కాన్పూరు రోడ్డులోని నవాబ్‌గంజ్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అక్కడ ఓ కోతి లిక్కర్ షాపునకు పర్మనెంట్ కస్టమర్‌గా మారింది. చిల్ల్డ్ బీరుపై మనసు పారేసుకున్న ఈ వానరానికి ఓ కస్టమర్ ప్రతి రోజు బీర్ బాటిల్ కొనిచ్చేవాడు. ఆ తర్వాత ఆ వానరం కాలేయం పెరిగి చనిపోయింది. సో, ఇప్పుడు మనం కోతులకు చెప్పాల్సిన నీతి ఏంటంటే… ‘మీరూ మనుషుల్లా మందుకు బానిసలై కాలేయాన్ని కాల్చుకోకండి.’ అని.
रायबरेली में बंदर का शराब पीने का वीडियो हुआ वायरल जो शराब की दुकान में आने वाले लोगो से शराब छीन लेता है और गटक जाता है। pic.twitter.com/We8qaAY4pi
— Anurag Mishra पत्रकार (@AnuragM27306258) October 30, 2022