Samantha : కుందనపు బొమ్మ ” సమంత ” గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవలే తన అనారోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సామ్ త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కాగా ఈ తరుణంలోనే ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్… సామ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బెనిక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
సమంత తాజాగా యశోద అనే చిత్రంలో నటిస్తుంది. హరి, హరీష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర చేస్తుండగా… శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ‘యశోద’ థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుండగా… తాజాగా యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.
ఆ వీడియొ లో యశోద మూవీ… యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్ బెన్ మాట్లాడుతూ… నేనెప్పుడూ యాక్టర్ సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాను. వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్గా తెలియాలి. అందుకని, ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం. నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. అందువల్ల, వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది. సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అందుకని ఆమెతో షూటింగ్ చేయడం బావుంటుంది. కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈ మూవీ యాక్షన్ సీన్స్‌లో ఉంటాయని అన్నారు. కాగా ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు కూడా యానిక్ బెన్ వర్క్ చేశారు.