Spy Movie : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ-2 సినిమాతో అనుకోని రీతిలో విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో. గతంలో కార్తికేయకి ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కింది. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది.
ఈ మూవీలో నిఖిల్ కి జోడిగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. శ్రీచరణ్ పకల సంగీతం అందిస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పథకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ‘గర్రి బిహెచ్’ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి ఎడిటర్ గా కూడా గర్రి వ్యవహరించడం గమనార్హం. ఈ మూవీతో నిఖిల్ కి పాన్ ఇండియా మార్కెట్ కూడా క్రియేట్ అయ్యింది. దీంతో ఈ హీరో తదుపరి సినిమాలు పై భారీ హైప్ నెలకుంది.
ప్రస్తుతం ‘స్పై’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నిఖిల్. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. కాగా ఇప్పుడు హీరో నిఖిల్ ఈ సినిమా నుంచి ఒక విషయం లీక్ చేశాడు. తన కొత్త సినిమా నుంచి ఒక ఫోటోని అఫీషియల్ లీక్ చేశాడు. మూవీలోని ఒక వర్కింగ్ స్టిల్ ని షేర్ చేస్తూ.. నేషనల్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది సమ్మర్ కి అన్ని లాంగ్వేజ్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నట్లు తెలియజేశాడు. లీక్ చేసిన ఫొటోలో నిఖిల్ లుక్ ఆకట్టుకుంటుంది.
Official Leak 😉
Will be MASSIVE, Multi Language, National Thriller #SPY
This Summer 🔥🔥🔥 in Theatres Across India 🇮🇳 pic.twitter.com/g95PvSyQgw— Nikhil Siddhartha (@actor_Nikhil) January 30, 2023