Actress Kalpika : నటి కల్పిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే అని చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో హీరోయిన్ సమంతకు అక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇప్పుడు తాజాగా తనని ఒక యంగ్ కమెడియన్ సోషల్ మీడియా వేదికగా దూషిస్తున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలంటే టీఆర్ఎస్ నాయకురాలు కవితని అభ్యర్థించింది. దీంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
కాగా అసలు విషయానికి వస్తే… ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో తన కామెడీతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు అభినవ్ గోమటం. గత కొన్ని రోజులుగా అభినవ్, కల్పిక ల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతుంది. తన నటనకు అవార్డును పొందడం గురించి అభినవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు కల్పిక చెప్పుకొచ్చింది. అయితే వారి మధ్య ఏం జరిగిందనేది తెలియనప్పటికీ, వీరిద్దరి మధ్య గొడవ అయితే తారాస్థాయికి చేరుకుందని తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు వేస్తూ దూషించుకుంటున్నారు.
అభినవ్ తనని ఐటెం అంటూ కించపరిచేలా మాట్లాడిన చాట్స్ ని షేర్ చేస్తూ.. అతడు తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటే డిమాండ్ చేస్తుంది. మహిళల పట్ల ఇలా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, సైబర్ క్రైమ్ పోలీసులను, అలాగే పలువురు సెలబ్రిటీస్ ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టింది. మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి.