Entertainment సమంత విడాకులు, రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, సాయి పల్లవి వ్యాఖ్యలు, దీపిక డ్రెస్సింగ్ వీటిపై జరిగిన ట్రోలింగ్స్ ఉమెన్ ఫ్రీడమ్ లేదని చెబుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు నటి రమ్య..
తమిళ కన్నడ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి రమ్య ఈమె గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూర్య సన్నాఫ్ కృష్ణతో మంచి పేరు సంపాదించుకున్నారు అలాగే 2013 కర్ణాటక బయో ఎలక్షన్స్ లో మాండ్య నుంచి ఎంపీగా గెలిచిన ఈమె తాజాగా ఉమెన్ ఫ్రీడం కోసం కొన్ని వ్యాఖ్యలు చేశారు…
“సమంత విడాకులు తీసుకున్నపుడు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. తప్పందా తనదే అన్నట్లుగా నాగచైతన్య ఫ్యాన్స్ రెచ్చిపోయి కామెంట్లు చేశారు. అసలే వివాహ బంధం తెగిపోయిన బాధలో ఉన్న ఆమె పట్ల నెటిజన్లు ప్రవర్తించిన తీరు అస్సలు సరిగా లేదు. అలాగే కశ్మీర్‌లో అధికంగా ఉన్న ముస్లిం అతివాదులు హిందువులపై చేసిన దాడులైనా, నేడు హిందుత్వ వాదులు ముస్లింలను గోవుల పేరుతో వేధిస్తున్న దాడులైనా ఒకటే అన్నట్లుగా సాయి పల్లవి మాట్లాడితే ఆమెపైనా విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇక రక్షిత్ శెట్టితో రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంపైనా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. ఇదిలా ఉంటే.. దీపికా పదుకొనే గతంలో జేఎన్‌యూ విద్యార్థులకు మద్ధతు తెలపడంపై విమర్శలతో పాటు బెదిరింపులు ఎదుర్కొంది. ప్రస్తుతం ‘పఠాన్’ మూవీలో ‘బేషరమ్ రంగ్’ పాటలో తాను ధరించిన దుస్తులపైనా ట్రోల్స్ ఎదుర్కొంటోంది… అయితే ఇలాంటి ఎన్నో విషయాల్లో మహిళలనే అందరూ ఎందుకు ట్రోల్ చేస్తూ ఉంటారో తెలియటం లేదు..” అంటూ పోస్ట్ చేసింది..