Entertainment ప్రముఖ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సినిమాల ద్వారా ఎంత ఫేమస్ అయ్యారో తన వ్యక్తిగత జీవితం పరంగా కూడా అంతే ఫేమస్ అయ్యారు తన కూతురితో కలిసి నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసే సురేఖమని ప్రస్తుతం తాను సినిమాలో ఎందుకు నటించట్లేదు చెప్పుకొచ్చింది..
సురేఖ వాణి టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంది అయితే ప్రస్తుతం సినిమాల వలన కాకుండా సోషల్ మీడియాలోనే ఎక్కువ ట్రెండ్ అవుతూ వస్తున్నారు ఈమె తన కూతురు సుప్రీత తో కలిసి నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.. ట్రెండీగా కనిపిస్తూ తన వయసులో సగం ఉన్న కూతురుతో పోటీ పడుతూ ఉంటారు.. అంతేకాకుండా పొట్టి పెట్టు డ్రెస్సులు వేసుకొని ఎప్పటికప్పుడు ఎన్నో పోస్టులు పెడుతూ ఉంటారు.. అయితే ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా జీవితంలో ముందుకెళ్ళిపోతున్నారు.. అయితే తాజాగా ఆమె స్వాతిముత్యం సినిమాలో నటించారు ఈ సినిమా హిట్ టాక్ ని అందుకోవటంతో సక్సెస్ మీట్‌ను అరెంజ్ చేసింది సినిమా బృందం అయితే ఇందులో మీరు ఎందుకు సినిమాల్లో నటించట్లేదు అని మీడియా అడిగిన సమాధానానికి తాను నటించాలి అనే అనుకుంటున్నానని అయితే అవకాశాలు తన వరకు రావడం లేదని అందుకే సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తనకు అర్థం కావట్లేదని అన్నారు. అంతేకాకుండా మళ్ళీ మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని అందుకోసమే ఎదురు చూస్తున్నట్టు తెలిపారు..