Entertainment ఇప్పటికీ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ అభిమానుల్ని అలరిస్తున్న హీరోయిన్ త్రిష అయితే ఈమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
త్రిష సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ కూడా అలానే ఉంది ఈ భామ ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిల కాలేజ్ కి వెళ్ళగలదు అలాంటి అందం సొంతం చేసుకున్న త్రిష ఇన్నేళ్లుగా కెరీర్లో నిలదిక్కుకోవడానికి కారణం కూడా ఆమె అందమని చెప్పవచ్చు.. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఈమె ఈనెలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే ఈ సందర్భంగా ఈమె తన కెరీర్ను మళ్ళీ నిలబెట్టిన సినిమా కోసం చెప్పుకొచ్చారు.. ఇప్పటివరకు దాదాపు 70 చిత్రాల్లో నటించింది ఈ భామ.. సీనియర్ హీరోయిన్ గా ఇప్పటికీ సినీ ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. నేటితో త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖుల, సెలబ్రెటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ త్రిష త్రో బ్యాక్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా త్రిష తన కెరీర్ ను మళ్ళీ నిలబెట్టిన చిత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వం 1 అంటూ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకుంది.. దాదాపు 2016 నుంచి అవకాశాలు లేకుండా ఉంటున్న త్రిష మళ్లీ ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చింది.. ఈ సినిమా హిట్ అవ్వడంతో త్రిషకు మళ్ళీ వరుస అవకాశాలు క్యూ పడుతున్నాయి..