Entertainment ప్రముఖ టీవీ నటి తునిషా శర్మ తాజగా ఆత్మహత్య చేసుకున్నారు అయితే ఈమె చనిపోవడానికి ఆరు గంటల ముందు కూడా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటూ మేకప్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారని అలాగే ఇది జరిగిన కాసేపటికి షూటింగ్స్ పార్ట్ లోనే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
నటి తునిషా శర్మ ఆత్మహత్యలో పలు కోణాలు వినిపిస్తున్నాయి.. అయితే ఈమె షూటింగ్ సమయంలోనే అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది ఇంతకుముందు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను ఉంచారు దీంట్లో మేకప్ వేసుకొని ఎంతో ప్రశాంతంగా కనిపించారు అయితే ఇలా ఉన్న ఆమె అకస్మాత్తుగా చనిపోవడానికి కారణాలు ఏంటా అంటూ వార్తలు వినిపిస్తున్నాను నేపథ్యంలో తునిషా తల్లి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..
తునిష ఆత్మహత్య చేసుకోవడం వెనక అతని ప్రియుడి హస్తం ఉందంటూ తునిషా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ హత్యకు కారణంగా ప్రియుడు షీజాన్ ఖాన్ అని సందేహిస్తుంది. ఇప్పటికే అతనిపై పోలీస్ కేసు పెట్టడం…విచారణ సాగడం తెలిసిందే. తనతో పెళ్లికి షీజాన్ నిరాకరడించడంతో టునీషా సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తుంది అలాగే షీజాన్ తుని షా తో పాటు వేరే శ్రద్ధ అనే అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడని ఈ కారణంతోనే పెళ్లికి నిరాకరించాడని చెప్పుకొచ్చింది ఈ విషయంతో మనస్థాపానికి గురైన తునిషా ఆత్మహత్య చేసుకున్నట్టు తునిషా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..