Entertainment : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అడవి శేషు.. వరుసగా వచ్చిన అవకాశాలు అంత పుచ్చుకుంటూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే తాజాగా ఆయన నటించిన హిట్ 2 చిత్రం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది..
క్షణం సినిమాతో తెలుగు ధరకే హీరోగా పరిచయం అయ్యారు అది అడవి శేషు ఈ సినిమాకు కథను కూడా ఆయనే రాసి మంచి పేరు సంపాదించుకున్నారు.. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తరవాత ‘గూఢచారి’ సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు అడివి శేష్. ఈ సినిమాకు కూడా కథ అడివి శేషే అందించారు. ‘గూఢచారి’ సినిమాతో హీరోగా శేష్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత ఆయన నటించిన ఎవరు చిత్రం సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందాయి.. ఆ తర్వాత మేజర్ చిత్రంతో ప్రామిసింగ్ హీరో లిస్ట్ లో చేరిపోయాడు శేషు.. అతని మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది.. దీంతో ఇప్పుడు శేష్ హీరోగా వస్తోన్న ‘హిట్ 2’ సినిమా ఆయన కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే అతనికి కెరియర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ను చేసిన చిత్రంగా నిలిచిపోయింది.. ‘హిట్ 2’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.14.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం..