Entertainment అడవి శేషు.. తాజాగా అతను నటించిన హిట్ 2 పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.. అయితే హిట్ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా ఎదురైన స్వీట్ మెమొరీస్ గుర్తు చేసుకున్నాడు ఈ హీరో
డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. ఈ హిట్ తో అడివి శేష్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు… నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే. హిట్ 3లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నడన్న విషయాన్ని హిట్టు క్లైమాక్స్ లో చెప్పిన సంగతి తెలిసిందే.. ఇక హిట్ 2లో అడివి శేష్ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసినట్లు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నాయి.. హిట్ 2 ఘనవిజయం సాధించడంతో హిట్ 3పై ఇప్పటి నుంచే బజ్ మొదలైంది. అయితే ఈ చిత్రం చూశాక మరి ఎలా స్పందించారో చెబుతూ ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాను చూసి ఏమన్నారు చెప్పుకొచ్చారు అడవి శేషు..
“హిట్ 2 రిలీజ్ రోజు ప్రీమియర్ షోలు మొదలయ్యాక నాకు వరుసగా ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. మహేష్ బాబు సర్ మూడు మిస్ కాల్స్ చేసి ఉన్నారు. ఏమైందో ఏమో అని కంగారుగా ఫోన్ చేశా. ఏమైంది సర్ అని అడిగితే.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది శేష్ అని అన్నారు.. ఆ మాట అనగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి…” అన్నాడు.. అలాగే వెంటనే “సర్ మీరు ఒకే సంవత్సరం ముగ్గురిని కోల్పోయారు. ఇంతటి బాధ తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టం సార్. మీరు ఒంటరి అని ఎప్పుడూ అనుకోవద్దు.. మీ చుట్టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. మీకు ఒక తమ్ముడుగా లైఫ్ అంతా ఎప్పుడూ తోడుంటా.. ” అని చెప్పాను అన్నారు