పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ‘సరిపోదా శనివారం’లో నేచురల్ స్టార్ నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో ఆమెకిది రెండో సినిమా. ఈరోజు, మేకర్స్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రియాంక మోహన్ చారులత అనే ఇన్నోసెంట్ పోలీసుగా కనిపించింది. ఆమె క్యారెక్టర్‌లో ఫిట్‌గా కనిపిస్తుంది. అందమైన చిరునవ్వు ఆకట్టుకుంది. ఖాకీ దుస్తులు ధరించి, భుజంపై బ్యాగ్‌తో నడుస్తూ కనిపించింది. సినిమాలో ప్రియాంక పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. మురళి జి డీవోపీ కాగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సరిపోదా శనివారం షూటింగ్ చివరి దశలో ఉంది.
Cast : Nani, Priyanka Arul Mohan, SJ Suryah, Sai Kumar
Technical Crew :
Writer and Director: Vivek Athreya
Producers: DVV Danayya, Kalyan Dasari
Banner: DVV Entertainments
Music: Jakes Bejoy
DOP: Murali G
Editor: Karthika Srinivas
Fights: Ram-Lakshman
PRO: Vamsi-Sekhar
Marketing: Walls And Trends