గౌతమ్ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటలను ఇటీవలే విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా, సింగర్ కాల భైరవ పాడారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. కాగా, మంగళవారం నాడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
కథా రచయిత, హీరో, దర్శకుడు అయిన గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. మాది కొత్త టీమ్. మొదటి సినిమా. ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసి సినిమాపై తపనతో ఈ సినిమా తీశాను. ఈ సినిమాను ఎందుకుచూడాలనేవారికి చెప్పేది ఒక్కటే. ఈ సినిమా ఒక హీరో మీదనో కేరెక్టర్ మీదనే తీసిందికాదు. యంగ్‌స్టర్స్ అందరి కథ. ఎదిగి నతర్వాత వయస్సువచ్చినవారికి చెందిన కథ కూడా. మనలో మనకు జరిగే సంఘర్షణ ఇందులో చక్కగా చూపించాం. ట్రైలర్ లో డ్రెగ్స్, ఆల్కహాలు అంశాలున్నాయి.వీటిపై పలువురు కామెంట్లు చేశారు.
రచయితగా, దర్శకుడిగా సినిమాను ఎలా చూపించాలో నాకు తెలుసు. అందుకే సినిమా మొత్తం చూసి మీరు స్పందిచండి. ఇది అన్ని వయస్సులవారికి నచ్చే సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తుందని చెప్పగలను. ఇందులో రెండు షేడ్స్ వున్న పాత్రను పోషించాను. మాతోపాటు 40 మంది మీముందుకు వస్తున్నాం. మీ ఆశీర్వాదం కావాలి. ఇందులో నటీనటులు, సాంకేతిక సిబ్బంది కూడా వున్నాం. కుటుంబంలోని పిల్లల ఆలోచనలు ఎలా వుంటాయి అనేది పెద్దలు గ్రహించేట్లుగా చూపించాం. త్వరలో ప్రీ రిలీజ్ వేడుక వుంది. అప్పుడు మరిన్ని వివరాలు తెలియజేస్తాను. కమర్షియల్ అంశాలున్న సినిమా అని చెప్పారు.