Akhanda Hanuman Chalisa Parayanam, Kondagattu Hanuman Temple, MLC Kavitha, Kondagattu Helipad, Bhakthi News,
BHAKTHI NEWS: రేపటితో ద్విమండల కాలం పూర్తి చేసుకోనున్న హనుమాన్ చాలీసా పారాయణం: ఎమ్మెల్సీ కవిత.
దిగ్విజయంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణం… అశేష భక్తజనానికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రేపటితో ద్విమండల(82 రోజులు) కాలం పూర్తి చేసుకోనున్న హనుమాన్ చాలీసా పారాయణం…ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ కవిత
కొండగట్టు అంజన్న సన్నిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు: ఎమ్మెల్సీ కవిత
కొండగట్టులో ఇప్పటికీ పూర్తయిన నూతన హెలిప్యాడ్
రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి 17 నుండి కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో, కొండగట్టు అంజన్న ఆలయంలో జరుగుతున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం జూన్ 4న దిగ్విజయంగా రెండు మండలాల (82 రోజులు) పూర్తి చేసుకొనుంది. ఈ సందర్భంగా గత 82 రోజులుగా ఈ మహోన్నత ఆధ్యాత్మిక పుణ్యకార్యంలో పాలుపంచుకుంటున్న అశేష భక్త జనం, పూజారులు, పండితులు అందరికీ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలియజేశారు. లాక్ డౌన్ కారణంగా కొన్ని అవరోధాలు ఎదురైనా, అశేష భక్త జనం తమ ఇండ్ల నుంచే పారాయణంలో పాల్గొనడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు, ప్రతి ఇంట్లో పదకొండు సార్లు చాలీసా పారాయణంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిచింది. కొండగట్టు దేవస్థానం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అయితే లాక్ డౌన్ తీవ్రత కారణంగా అభివృద్ధి పనులు కొంత నెమ్మదించాయని, లాక్ డౌన్ పూర్తయిన అనంతరం తిరిగి ప్రారంభమవుతాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. లాక్ డౌన్ ప్రారంభానికి ముందే కొండగట్టులో నూతన హెలిప్యాడ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు ఎమ్మెల్సీ కవిత.
కొండగట్టు దేవస్థానం ఆవరణలో రూ.90లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్తూపం పనులు లాక్ డౌన్ కారణంగా కొంత నెమ్మదించినా, త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అంతేకాదు భక్తులు సిద్ధం చేసిన రామకోటి ప్రతులను, లాక్ డౌన్ ముగిసిన అనంతరం స్వీకరిస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.