Entertainment టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగా అఖిల్ అక్కినేని గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు..
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఫిబ్రవరి 18న శివరాత్రి సందర్భంగా విడుదల కాబోతుంది కాశ్మీరీ పరదేశి ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు ఈ సినిమాను నిర్మించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను ప్రెసెంట్ చేయనున్నారు అయితే గత రాత్రి ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు దీనికి గెస్ట్ గా అఖిల్ వచ్చారు.. ఈ సందర్భంగా మాట్లాడిన అఖిల్ కిరణ్ అబ్బవరం ను ఎంతగానో మెచ్చుకున్నారు..
మాట్లాడటానికి మైక్ పట్టుకుంటూ అందరూ మాట్లాడిన తర్వాత ఇక నేనేం మాట్లాడతాను అంటూ స్టార్ట్ చేసిన అఖిల్.. “గీతా ఆర్ట్స్‌తో జర్నీ ప్రత్యేకంగా ఉంటుంది. ఇవాళ నేను గెస్ట్‌గా రాలేదు. ఒక కుటుంబ సభ్యుడిగా, వాళ్లింట్లో అబ్బాయిలాగా వచ్చాను. తాను ఇచ్చిన హగ్ ఒక్కటే కాదు.. అరవింద్ గారు ఇచ్చిన హగ్ కూడా బాగుంది.. గీతా ఆర్ట్స్‌తో చాలా మెమొరీస్ ఉన్నాయి.. నేను చేసిన సినిమా చాలా మంచిగా సాగింది ఎక్కువ రోజులు షూట్ చేసిన సొంత ఫ్యామిలీతో పనిచేసిన అనుభవం కలిగింది.. యంగ్ టాలెంట్‌తో పాటు కొత్త, స్ట్రాంగ్ కంటెంట్‌ను గీతా ఆర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ వస్తోంది.. అరవింద్ గారు కలిసినప్పుడల్లా నెక్స్ట్ ఏం చేయాలని పరితపిస్తుంటారు. అంత కసి.. ఈ ఏజ్‌లో కూడా, ఇంత అచీవ్ చేసిన తర్వాత కూడా మంచి కంటెంట్‌తో రావాలనే కోరిక ఎంత మంచి ఆలోచన అది. ఇలా పనిచేస్తూ యంగ్‌స్టర్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నందుకు థాంక్యూ సర్.. అలాగే కిరణ్ స్టోరీ చూస్తుంటే కష్టమెప్పుడూ వృథా కాదని అర్థమైంది. కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ కావచ్చని నిరూపించినందుకు కిరణ్‌కు థాంక్స్.. “అంటూ చెప్పుకోచ్చారు అఖిల్