Akkineni Akhil : అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్… అఖిల్ చిత్రంతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హలో , మిస్టర్ మజ్ను సినిమాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించిన … ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని చెప్పాలి. ఇక ఇటీవలే ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ” సినిమా మంచి వసూళ్లను సాధించి మొదటిసారి అఖిల్ హిట్ ను ఖాతాలో వేసుకునేలా చేసింది. ప్రస్తుతం అఖిల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం ” ఏజెంట్ “. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇటీవలే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
అయితే 2023 సంక్రాంతి రేసులో అగ్ర కథానాయకులు పోటీ పడనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఇటీవల ఈ రేసు నుంచి యంగ్ రెబల్ స్టార్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం వాయిదా పడింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ దారి లోనే అక్కినేని అఖిల్ కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
ఏజెంట్ చిత్రం రిలీజ్ వాయిదా పడనున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. నిజానికి ఈ మూవీ ఆగస్ట్ లో విడుదల కావాల్సి ఉండగా… పలు కారణాలతో వాయిదాలు పడుతూ వస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం అందుతుంది.