Entertainment బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో షోలు వచ్చాయి వాటిని విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వాటిలో ఒకటి ఆలీతో సరదాగా కార్యక్రమం ఈ కార్యక్రమానికి హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు ఎందరో సెలబ్రెటీలు ఈ షోలో సందడి చేసి నవ్వులు పూయించారు. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ వచ్చి ఎన్నో విషయాలు పంచుకున్నారు తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది..
ప్రతి వారం ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి తాజాగా యాంకర్ సుమ అతిథిగా వచ్చారు.. సుమ తో కలిసి ఆలీ తనదైన శైలిలో కామెడీ పండించారు… ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు తనకు గ్యాప్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు ఆలీ..
ఆలీ పెద్ద కుమార్తె వివాహం జరిగింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. అయితే ఈ విషయం అప్పట్లో సంచలనం మారింది దీంతో ఆలీ స్వయంగా స్టేట్మెంట్ ఇస్తే కానీ అందరూ కుదట పడలేదు మళ్లీ ఇదే విషయంపై ప్రస్తుతం చర్చ జరిగింది…. ఆలీ తో సరదాగా కార్యక్రమంలో సుమ “నీకూ పవన్ కళ్యాణ్ కి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించగా..””నాకు పవన్ కు మధ్య గ్యాప్ లేదు. దానిని బయటి వారే సృష్టించారు. మా అమ్మాయి పెళ్లికి కూడా పవన్ వస్తా అన్నారు. కానీ చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ కావడంతో రాలేకపోయారు” అంటూ అలీ చెప్పుకొచ్చారు.