Hostel Days : ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో సినిమాలు కంటే వెబ్ సిరీస్ ఎక్కువ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. దీంతో పలు ఓటీటీ సంస్థలు మంచి కంటెంట్ తో పలు వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఇటీవల ‘సీట్ కారం కాఫీ’ అనే ఒక ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. జులై 6 నుంచి ఈ సిరీస్ అమెజాన్ లో ప్రసారం అవుతుంది.
ఇప్పుడు మరో సిరీస్ ని సిద్ధం చేసింది ప్రైమ్ వీడియో. ఈసారి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ని అలరించబోతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ లైఫ్ నేపథ్యంతో “హాస్టల్ డేస్” అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైనింగా ఉంది. కాలేజీ లైఫ్ లో కనిపించే స్నేహం, ప్రేమ, సరదాగా చేసే పనులు, హాస్టల్ లో కష్టాలు, స్టడీస్, సీనియర్ అండ్ జూనియర్ మధ్య జరిగే సందర్భాలను కామెడీ డ్రామాగా చూపించారు.
ఆదిత్య మండల ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తుండగా ది వైరల్ ఫీవర్ (టివిఎఫ్) నిర్మిస్తుంది. మొత్తం అయిదు ఎపిసోడ్స్ తో ఆరుగురు విద్యార్థుల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. దరహాస్ మాటూరు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్, అనన్య ఆకుల, ఐశ్వర్య హొలకాల్ మరియు జయేత్రి మకన ప్రధాన పాత్రలలో నటించారు. హిందీ మరియు తమిళ భాషల్లో సూపర్ హిట్టుగా నిలిచిన ఈ సిరీస్ జులై 13 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.