Entertainment అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ సంపాదించేసిందో అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ భార్య గానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈమె తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి..
స్టార్ హీరో భార్య అల్లు స్నేహ ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా ముందు నుంచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఇప్పటికే తండ్రికి సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటూ వస్తున్న ఈమె ఒక ఫోటో స్టూడియో అని కూడా నడిపిస్తున్న సంగతి తెలిసిందే అలాగే తాజాగా ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకునే ఈ భామ మళ్లీ ఇంకొకసారి రాయల్ లుక్ లో కనిపించింది..
అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. 2011లో వీరి వివాహం ఘనంగా జరిగింది.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతో సమానంగా తనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు అంటే స్నేహ రెడ్డి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఇప్పటికీ హీరోయిన్లకు పోటీగా ఫోటోషూట్ లో ఇస్తూ వస్తుంది స్నేహ.. తాజాగా అల్లు స్నేహ పంచుకున్న ఈ ఫోటోలో ఈమె రాయల్ లుక్ లో కనిపిస్తుంది ఇది చూసిన వారంతా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు…