Ameer Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ గుండెపోటుతో అపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. ముంబై లోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో జీనత్ ను జాయిన్ చేసినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. తల్లిని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అమీర్ ఖాన్… ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అమీర్ ఖాన్ స్పందించలేదు.
కాగా ఇటీవల జరిగిన దీపావళి వేడుకలను అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు అంతా కలిసి జరుపుకున్నారు. ఇప్పుడు అనుకోని రీతిలో జీనత్ కు ఇలా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో అమీర్ అభిమానులు అంతా ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.
ఇక అమీర్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే… ఇటీవల కరీనా కపూర్, నాగ చైతన్య తో కలిసి నటించిన ” లాల్ సింగ్ చద్దా ” ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఆ సినిమా ఫారెస్ట్ గంప్ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరొక రీమేక్ సినిమా చేయబోతున్నారని… అందులో అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల సమయంలో కూడా ఈ సినిమా బాయికాట్ చేయాలంటూ కొంతమంది పెద్ద ఎత్తున డిబేట్ చేసిన విషయం తెలిసిందే.