Baby Movie : విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఈ కుర్రాడు హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఓటీటీ వేదికగా విడుదల అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తన గత చిత్రం పుష్పక విమానంతో ప్రేక్షకులకు నవ్వులు పూయించాడు.
ఇప్పుడు తాజాగా సాయి రాజేష్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘బేబీ’. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. డైరెక్టర్ మారుతి, ఎస్ కె ఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పథకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఆ టీజర్ లో… మొదటి ప్రేమకి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అంటూ చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
స్కూల్ లో మొదలైన ప్రేమని నేచురాలిటీకి చాలా దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఆ క్రమంలోనే హీరోయిన్ వైష్ణవిని డిగ్లామరైజ్డ్ పాత్రలో చూపించారు. కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని, ఎడమ కన్ను అదిరితే చెడు జరుగుతుందని, కానీ ఏదో జారబోతుందని తెలిసినప్పుడు మాత్రం అమ్మాయిలకు గుండెల్లో అదురుతుంది అనే డైలాగ్ లు యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ ని బట్టి చూస్తే ఇది ఒక ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది.