Neha Chowdary : ప్రముఖ యాంకర్ నేహా చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా… తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. తిరుపతికి చెందిన నేహా… రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నేషనల్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ అందుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా నేహా పెళ్లి చేసుకోబోతుంది అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
కాగా బిగ్బాస్ ఎంట్రీ సమయంలో కూడా నాగార్జునతో ‘బిగ్బాస్ షోకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంటిలో వాళ్లకి చెప్పి వచ్చాను’ అంటూ వెల్లడించింది నేహా. దీంతో ఈ భామ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అనే వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ నేహా తన అభిమానులందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు ‘ఐ సేడ్ ఎస్’ అంటూ యూట్యూబ్ కి సంబంధించిన లింక్ ని జతచేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. యూట్యూబ్ లో నేహా.. ‘అలా నేహాతో’ అనే ఒక బ్లాగ్ రన్ చేస్తుంది. ఆ బ్లాగ్ లో ‘నా పెళ్లి గోల మొదలైంది’ అంటూ ఒక వీడియో చేసి తన కాబోయే వరుడుని రెవీల్ చేసింది. ఇంజనీరింగ్ క్లాస్ మేట్ అయిన తన స్నేహితుడినే వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. దాదాపు 13 ఏళ్ళ నుంచి వీరిద్దరూ ప్రేమించుకోగా, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీంతో ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజెన్లు పోస్ట్ లు పెడుతున్నారు.