Andra Pradesh CM YS Jagan Visited Vijayawada Kanakadurgamma Temple, Jogi Ramesh MLA, Dassera Festival, AP News, Telugu World Now
AP NEWS: దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారితో కలసి పాల్గొన్న పెడన శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు..ఆయన వెన్నంటి పెడన శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు మరియు ఇతర నాయకులు కూడా ఉన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సీఎం సమర్పించారు. ముఖ్యమంత్రికి మరియు జోగి రమేష్ గారికి వేద పండితులు ఆశీర్వచనాలు తెలిపి తీర్థ ప్రసాదాలు అందజేశారు..
సీఎం రాక సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు మాట్లాడుతూ..
▪️దేవి నవరాత్రులు ఘట్టంలో భాగంగా అమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండలాని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో గడపాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కోరుకున్నారు..▪️ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా మన మంచి ముఖ్యమంత్రి ,విశాల హృదయమున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ,అన్ని వర్గాల ప్రజలు, అక్కలు ,చెల్లెమ్మలు, అమ్మలు ,అన్నలు పెద్దలు ఇలా అందరూ సంతోషంగా జీవితాలు గడపాలని వేడుకున్నారు..
▪️ సువిశాల ఆంధ్రప్రదేశ్ లో దాదాపు కోటి మంది అక్కాచెల్లెళ్లకు కు సుమారుగా 6,782 కోట్ల రూపాయల నగదును ఆసరా పథకం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి బటన్ నొక్కి జమ చేశారు.▪️దసరా పండగ కంటే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం వల్ల అక్కచెల్లెమ్మలకు పండుగ వారం రోజుల ముందే జరుపుకుంటున్నారు..
▪️దేశంలో 29 రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో మనసు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు వెన్నుదన్నుగా నిలిచారు..▪️సమర్థుడైన మంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి నేతృత్వంలో మనం కరోనా ని కట్టడి చేశాం.. అభివృద్ధి చేసుకుంటున్నాం..రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది.