Anupama Parameswaran : అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాను చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో ఎంతో ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఒక్క పోస్ట్ పెడితే చాలు, అది ట్రేండింగ్ లో నిలవాల్సిందే. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ ని ముందుకు తీసుకొచ్చింది.
బాలీవుడ్ లో మనం మ్యూజిక్ వీడియో కల్చర్ ని చూస్తుంటాము. స్టార్ హీరోలు, హీరోయిన్లు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ మ్యూజిక్ వీడియో ట్రెండ్ ని మన ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ స్టార్ ప్రయత్నించలేదు. తాజాగా ఈ ట్రెండ్ ని అనుపమ స్టార్ట్ చేసింది. ‘పద పద’ అనే ఒక ఆల్బమ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. డెన్నిస్ నార్టన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా చిన్మయి పడింది. ఇక ఈ సాంగ్ ని అనుపమతో మ్యూజిక్ కి వీడియోగా అందంగా చిత్రీకరించారు.
రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వంలో, ఏ వసంత్ అందమైన సినిమాటోగ్రఫీలో, విష్ణు దేవా డాన్స్ కోరియోగ్రఫీలో ఫస్ట్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ వీడియోని అనుపమ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఇక ఈ సాంగ్ లో అనుపమ జాపనీస్ లుక్స్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకుంటుంది. మరి ఆ పెప్పి సాంగ్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
ఇక అనుపమ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో టిల్లు స్క్వేర్ (Tillu Square) లో నటిస్తుంది. సిద్దూజొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ క్రేజ్ ఉంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయ్యి బాగా వైరల్ అయ్యింది.