రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు వేధం ఫౌండేషన్ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు అలిశెట్టి అరవింద్ గ్రాండ్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరానికే తల మాలికగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై కార్లపై హ్యాపీ బర్త్డే కేటీఆర్ అంటూ రాసి ప్రదర్శించారు. యువ నేతగా, శాస్త్ర సాంకేతిక రంగాలపై పట్టు ఉన్న తమ నాయకుడి చొరవతో ఎన్నో అంతర్జాతీయ ఐటీ సంస్థలు హైదరాబాద్ విశ్వనగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. గొప్ప నాయకుల లక్షణాలు కలిగిన తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
https://youtu.be/lIDYJhnefwc