‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా తన రెండవ ప్రాజెక్ట్- # అశోక్ గల్లా2 తో రాబోతున్నారు. అ!, జాంబీ రెడ్డి వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ హను-మాన్ కోసం పని చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
తన తొలి చిత్రం ‘హీరో’తో ఆకట్టుకున్న అశోక్ గల్లా తన తదుపరి స్క్రిప్ట్‌ని ఎంచుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ మేకోవర్ కాబోతున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘గుణ 369’ దర్శకుడిగా అర్జున్ జంధ్యాల ప్రశంసలు అందుకున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలకు పేరుపొందిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి యూనిక్ స్టొరీని రాశారు. మరి ఈసారి ఎలాంటి కొత్త జానర్‌తో అలరించబోతున్నారో వేచి చూడాలి.
ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు వెంకటేష్ క్లాప్ కొట్టగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేయగా, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని మిర్యాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది.. మేకర్స్, ప్రశాంత్ వర్మకు అందజేశారు. ఆది శేషగిరిరావు, బివిఎస్ రవి, గల్లా జయదేవ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తారు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన పాపులర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమరామెన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.