షాద్‌నగర్ లోని ASWA foundation వారి Children Learning Centre నుండి ఐదుగురు విద్యార్థులు అక్టోబర్ 20వ తేదీన హైదరాబాద్‌లో జరిగే 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ నుండి ఛాంపియన్‌షిప్‌ల చీఫ్ ఇన్‌చార్జ్‌గా ఉన్న Dr. P Srinivas Kumar స్వయంగా షాద్‌నగర్ కి వెళ్లి జ్ఞాపకశక్తిపై సెమినార్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి selections నిర్వహించి ఎంపిక చెయ్యడం జరిగింది.
ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారని, ఈ విద్యార్థులు సరైన ప్రోత్సాహంతో జాతీయ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పోటీ పడగలరని డాక్టర్ Dr. P Srinivas Kumar తెలిపారు. ఎంపికైన ఈ ఐదుగురు విద్యార్థులకు ఛాంపియన్‌షిప్ రుసుమును Dr. Uma Sharma, Mr. Nanjunda మరియు M. Srilakshmi స్పాన్సర్ చేయడం జరిగింది. Memory Sport గురించి తెలుసుకున్న వెంటనే తమ foundation లోని విద్యార్థులకు ఈ అవకాశం అందించాలని ముందుకు వచ్చిన ASWA Founder Srinivasa Raju మరియు Haritha గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ASWA Founder Srinivasa Raju మరియు Haritha గారు మాట్లాడుతూ… తమ Foundation నుండి ఐదుగురు విద్యార్థులు ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024కి ఎంపిక కావడం తమకు చాలా గర్వంగా ఉందన్నారు.
ASWA Founder Srinivasa Raju గారు మాట్లాడుతూ… షాద్‌నగర్ మురికివాడ ప్రాంతంలో రోజువారి పనులు చేసుకొనే వెనకబడిన వారి పిల్లలకి Children Learning Centre నడుపుతున్నామని, ఇటువంటి పిల్లలకి Indian Memory Sports Council నుండి Dr. P Srinivas Kumar గారు వచ్చి Indian National Memory Championship 2024 లో అవకాశం ఇస్తాం అని చెప్పగానే పిల్లలు ఎంతో సంతోషపడ్డారని తెలిపారు. అలాగే ఈ memory అంటే ఏమిటి, మన memory ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే Scientific Techniques ని Dr. P Srinivas Kumar గారు పిల్లలందరికీ ఒక ప్రత్యేక class తీసుకోడం జరిగిందని, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు.
ఇటువంటి వెనుకబడిన పిల్లలకి ఒక National Level Championship లో పాల్గొనే అవకాశం ఇవ్వడం, వీరి Championship fee కి కూడా Sponsors ని వారే సమకూర్చడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. Dr. P Srinivas Kumar గారు పిల్లలతో కలిసిపోయి వారి స్తాయికి తగ్గట్లు వాళ్ళకి నేర్పించడం అనేది పిల్లలని చాల ఆకర్షించిందని తెలిపారు. ఇలాంటి అవకాశం మా సంస్థకి మాత్రమే కాకుండా మా దగ్గర ఉండే ఎలాంటి పిల్లలకి చాలా ముఖ్యమని, ఈ పిల్లల్లో విశ్వాసం నింపడానికి గాని, వీళ్ళు ఇంకొంచం పైకి ఎదగడానికి గాని ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ASWA Foundation Co-Founder అయిన హరిత గారు మాట్లాడుతూ… Dr. P Srinivas Kumar గారు ఈరోజు వచ్చి తీసుకున్న సెషన్ వలన పిల్లల్లో కొత్తగా ఏదో నేర్చుకోవాలి అనే తపన కనిపించిందని, మాకెప్పుడు ఎలాంటివి పరిచయం కాలేదని తెలిపారు. ఈరోజు చెప్పిన memory tips ని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారని, పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకి ఎంతో ఓపికతో Dr. P Srinivas Kumar గారు సమాదానం చెప్పారని తెలిపారు. మా పిల్లలకి ఇటువంటి అవకాశం ఇదే మొదటిసారి అని, ఎవరు ఎంపిక అయినా కూడా మిగతావారు సంతోషపడతారని, అలాగే పాల్గొన్న వారిని చూసి మిగతా వాళ్ళు ప్రేరన పొంది ఇంకా నేర్చుకోడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నామని తెలియజేశారు.
Indian Memory Sports Council Championships ki Chief In Charge అయిన Dr. P Srinivas Kumar మాట్లాడుతూ… JNTUH నుండి Biotechnology లో Ph.D చేసిన తాను ఈ memory sport ను దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రతిభ గల వారిని కనుగొని శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నానని, తద్వారా ఒక రోజు భారతీయుడు ప్రపంచ మెమరీ ఛాంపియన్‌షిప్ గెలుపొందడం మనం చూడాలి అని, దానికి ప్రతి ఒక్కరి సహకారం కావలి అని కోరారు.
ASWA foundation వారి Children Learning Centre నుండి ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024కి ఎంపికైన విద్యార్థులు: S Nandini, M Mahesh, S Ashwini, M Meena, S Gangothri
మంత్రి వ్యాఖ్యలను నేను సమర్ధించ లేదు… వక్రీకరించి హెడ్డింగ్ పెట్టారు : నిర్మాత నట్టి కుమార్