మొఘల్ కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యే సమయానికి కరోనా తీవ్రత ఎక్కువగా వుండటంతో చిత్రీకరణ ఆపేశారు. తర్వాత పవన్ భీమ్లా నాయక్ మూవీలో బిజీ ఇపోయారు. తర్వాత ఎప్పటికప్పుడు షూటింగ్ మళ్ళీ మొదలవుతుందని అభిమానులు ఆశ పడినా పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వలన షూటింగు ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఇప్పటికే అరవై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్‌ను సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టేసాడు
పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ పాత్రను డైరెక్టర్ క్రిష్ పండగ సాయన్న అనే బందిపోటు క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని డిజైన్ చేసినట్లు కూడా సినీ సర్కిల్స్ టాక్.
అయితే 2024 ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉండటంతో ఇంకా పవన్ కళ్యాణ్ నుంచి ఎన్ని సినిమాలు వస్తాయా అన్న విషయం చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అవ్వటానికి ఎలా అయినా ఈ ఏడాది ఐపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది అని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా ఏ సినిమాపైనా సంతకం చేయలేదు. అయితే పవన్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.