Ayushman Khurana : విక్కి డోనార్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు ఆయుష్మాన్ ఖురానా. తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ యంగ్ హీరో. టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభంచిన అతను ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో హీరోగా ఆయుష్మాన్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత దమ్ లగాకై హైసా, మేరీ ప్యారీ బిందు, బరేలీ కీ బర్ఫీ, అంధాధూన్, బదాయి హో, బాలా, ఆర్టికల్ 15, గులాబో సితాబో, డాక్టర్ జీ వంటి తదితర సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు.
సినిమాలతో పాటు రియల్ లైఫ్ లోనూ ఎంతో సరదాగా ఉంటాడు. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపెట్టాడు ఆయుష్మాన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ యంగ్ హీరో తన పరసనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెర్టిగో సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. గత ఆరేళ్ల నుంచి నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నాను. నా అప్‌కమింగ్ మూవీ లో ఎత్తైన భవనం నుంచి దూకే సీన్ ఉంటుంది. రక్షణ కోసం హార్నెస్ కేబుల్స్ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని అమాంతం భయపడిపోయాను.
ఆ బాధ నరాలు తెగిపోయేలా చేసింది. విపరీతమైన తల తిరుగుడు కారణంగా చాలా సన్నివేశాల చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆన్ యాక్షన్ హీరో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నాడు.