సినీ కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన తననెంతో బాధపెట్టిందని సినీనటుడు నాగచైతన్య అన్నారు. ఆ సంఘటనతో సినిమాల కోసం థియేటర్‌కు వెళ్లడమే మానేశానని చెప్పారు. ‘లాల్‌సింగ్ చడ్డా’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడారు.
ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని తొలి సినిమా ‘జోష్’ ఆడుతున్న థియేటర్‌కు వెళ్లానన్నారు. ప్రేక్షకుల మధ్యే కూర్చొని సినిమా చూశానని.. తనను వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో తొలిరోజే ఆ సినిమా చూశానన్నారు.
అయితే సినిమా స్టార్టింగ్‌లో అందరూ బాగా ఎంజాయ్ చేశారని.. ఫస్ట్ హాఫ్ అయ్యే సరికి మాత్రం చాలా మంది ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేశారని నాగచైతన్య గుర్తు చేసుకున్నారు. ఆ క్షణం తాను చాలా బాధపడ్డానని చెప్పారు. ఆ అనుభవం తననెంతో భయపెట్టిందని.. ఎంతో నేర్పిందని వివరించారు. ఏదో ఒకరోజు థియేటర్‌కి వెళ్లి మళ్లీ ప్రేక్షకుల మధ్యే కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తానని చైతూ చెప్పుకొచ్చాడు.