Entertainment బుల్లి తెర ఆహాలో ప్రసారమైన నందమూరి నట సింహం బాల కృష్ణ అన్ స్టాపబుల్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్ తో బాలయ్య ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఆ సీజన్ ఆ షో ట్రైలర్లో బాలకృష్ణ లోని ఫుల్ ఎనర్జీని.. జోష్ ను డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేశారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అలాగే ఆ ట్రైలర్‌కు వచ్చిన స్పందనను తగ్గటుగానే షో సైతం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తగా ఎదురుచూస్తున్నారు..
అయితే ఈ సస్పెన్షన్ కు తెర దించుతూ త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఉంటుందని ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ ను తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు ప్రశాంత్ వర్మకే ఆహా అప్పగించింది.
ఈ విషయం గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “బాలకృష్ణ గారితో అన్ స్టాపబుల్ సీజన్ 1 ట్రైలర్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేన.. రెండో సీజన్ ట్రైలర్ షూట్ చేసే ఛాన్స్ కూడా నాకే రావాలని కోరుకున్నాను.. అలానే ఆ ఛాన్స్ నాకే దక్కింది. దీని కోసం ఓ మంచి కథ రాయమని ఆహా టీమ్ చెప్పింది.. నేను ట్రైలర్ చిత్రీకరణ కోసం రాసిన కథ వారికి నచ్చడంతో ట్రైలర్ ను తీయగలిగాను. ఈ నెల 4వ తేదీన విజయవాడలో దీని ఆవిష్కరణ ఉంటుంది. ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.