కంటెంట్ ఉన్న సినిమాలను జనాలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు కొత్తగా మదిలో మది అంటూ ఒక స్వచ్ఛమైన సరికొత్త ప్రేమ కథ చిత్రం అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. ప్రేమకథలు లేని చిత్రాలంటూ ఏవీ ఉండవు. ఏ జోనర్ లో చూసిన ఏదో పక్క చిన్న ప్రేమ కథ అయిన సినిమాలో ఉంటుంది అలాగే సినిమా కథ ఒక డిఫరెంట్ ప్రేమ కథ చిత్రం అయితే జనాలు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని నమ్మకంతో మదిలో మది అంటూ ఒక కొత్త టీం ముందుకు వస్తుంది.
ఈ సినిమాలో జై ఎన్ .పల్లా శ్రీనివాసరావు. స్వీటీ స్వాతి. సిరి రావుల చారి. సునీత. ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి కదా మాటలు దర్శకత్వం పల్ల ప్రకాష్ వహించారు. ఎస్ కే ఎల్ ఎం క్రియేషన్స్ బ్యానర్ పై జయ కుమార్ నేముకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
https://www.youtube.com/watch?v=0c493uAokJ8&t=17s
ఈ చిత్రం టైటిల్ని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చేతుల మీదుగా విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా ఈ చిత్రం టైటిల్ టీజర్ ని బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ గారి చేతుల మీదుగా విడుదలైంది.
అనంతరం కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… ఈ చిత్రం టైటిల్ చాలా కొత్తగా ఉంది అలాగే టైటిల్ టీజర్ కూడా సరి కొత్తగా అనిపించింది అంటూ మూవీ టీం ని అభినందించారు. ఈ మూవీ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నిటికీ భిన్నంగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా తిలారు అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుందని డైరెక్టర్ పల్ల ప్రకాష్ వెల్లడించారు.
ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని మూవీ టీం అంటున్నారు. ఈ టీం కి సపోర్ట్ గా నిలబడిన డి స్క్వేర్ ఫీల్ అకాడమీ ధనరాజు గారికి మూవీ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కొత్త టీమ్ అయిన వెనకడుగు వేయకుండా సపోర్ట్ చేసినటువంటి కావ్య కళ్యాణ్ రామ్ గారికి కూడా మూవీ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కొత్తవాళ్లయిన కంటెంట్ బాగుంటే జనాలు ఏ సినిమానైనా ఆదరిస్తారు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని తొందరలోనే మీ ముందుకు వస్తుందని అన్నారు.