Political సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల వలన తాను ఎంతో నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు..
బండ్ల గణేష్ ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను స్టార్ట్ చేసి నెమ్మదిగా నిర్మాత స్థాయికి ఎదిగారు ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో ఇటువైపు వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి మూడు నాలుగు ఏళ్ల క్రితం తెలంగాణ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా కనిపించారు.. 2019లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన బండ్ల గణేష్ కు నిరాశే ఎదురయింది.. అయితే అప్పట్లో ప్రచారం సమయంలో ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఈ వివాదాలతో కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న బండ్ల గణేష్ను తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు.. నెలరోజుల క్రితం తన రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపిన ఆయన తాజాగా రాజకీయాల వల్ల తనంత నష్టపోయారో చెప్పుకొచ్చారు..
“నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి చెప్తున్నా. ప్రస్తుతం నాకు ఉన్న పనులు, వ్యాపారాల కారణంగా నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నాకు ఇక ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం లేదు. అలానే ఏ పార్టీతో కూడా ఫ్రెండ్‌షిప్ లేదు.. రాజకీయాల కారణంగా జీవితంలో చాలా నష్టపోయాను. నాకు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే.. అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు..