Bandla Ganesh : ప్రముఖ నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బండ్లకు మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడిగా బండ్ల గణేష్ కి పేరుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లలో బండ్ల పాల్గొంటూ ఇచ్చే స్పీచ్ లకి నెక్స్ట్ లెవెల్ లో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు.
అయితే గత కొన్నాళ్లుగా బండ్ల గణేష్ – త్రివిక్రమ్ మధ్య ఇష్యూ జరుగుతోంది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ వివాదం మరోసారి బయట పడింది. త్రివిక్రమ్ ని సినీ పరిశ్రమలో గురూజీ అని అంటారని అందరికి తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ ప్రొడ్యూసర్ కావాలంటే ఏం చేయాలి అని బండ్ల గణేష్ కి ట్వీట్ చేశాడు. దీనికి బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ.. గురూజీని కలిసి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వు అయిపోతావు అని ట్వీట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. త్రివిక్రమ్ నే ఇండైరెక్ట్ గా అన్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
మరో నెటిజన్.. గురూజీకి కథ చెప్తే స్క్రీన్ ప్లే రాసి దానికి తగ్గట్టు కథ మార్చి, ఆ కథని షెడ్ కి పంపిస్తారని టాక్ ఉంది అని బండ్ల గణేష్ కి ట్వీట్ చేయగా, దీనికి బండ్ల గణేష్ సమాధానమిస్తూ., గురుశిష్యుల్ని, వేరు చేసే ధానిలో మన గురూజీ స్పెషలిస్ట్ అని ట్వీట్ చేశాడు. దీంతో బండ్లన్న ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ అయితే కచ్చితంగా త్రివిక్రమ్ కే అని అందరికి అర్థమైపోతుంది. ఇండైరెక్ట్ గా తనని, పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ విడతీశాడని బండ్ల గణేష్ చెప్తున్నట్టు ఉంది అతని ట్వీట్ చూస్తుంటే. దీనికి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే గురూజీ ఫ్యాన్స్ మాత్రం బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు.