Entertainment డీజే టిల్లు చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి.. ఇందులో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ కూడా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.. ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులు అలరించిన ఈ భామ ప్రస్తుతం బెదురులంక 2012’ చిత్రంలో నటిస్తోంది. కొమరం పుట్టినరోజు సందర్భంగా స్నేహ ఫస్ట్ లుక్ ని రీలీజ్ చేసింది చత్ర బృందం ఈ ఫోటోకు మంచి కామెంట్స్ వస్తున్నాయి..
సోమవారం నేహా శెట్టి పుట్టినరోజు కావడంతో బెదురులంక 2012 మూవీ నుంచి నేహా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లూక్కి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇందులో ట్రెడిషనల్ లుక్‌లో నేహా మరింత అందంగా కనిపిస్తుండగా.. ఈ చిత్ర డైరెక్టర్ క్లాక్స్ సైతం ఆమె అందం, అభినయంపై ప్రశంసలు కురిపించాడు. ఇందులో ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న నేహా శెట్టి ఈ లూక్లో పింక్ కలర్ శారీలో ట్రెడిషనల్‌గా కనిపిస్తోంది. కాగా సినిమాలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇదే క్రమంలోనే ఆమెను అందం, అభినయం కలబోతగా పేర్కొన్నాడు దర్శకుడు క్లాక్స్.
నేహా శెట్టి, యంగ్ హీరో కార్తికేయ జంటగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. 1954 జపనీస్ ఫిల్మ్ ‘సెవెన్ సమురాయ్’ చిత్రం నుంచి కొన్ని ఇన్‌స్పిరేషన్స్ తీసుకుని డైరెక్టర్ ఈ కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కలర్ ఫొటో ఫేమ్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతానికి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ప్రారంభంలో రిలీజ్ కానుంది అని సమాచారం..