ప్రత్యేక కధనం సీనియర్ జర్నలిస్ట్ ఆది
SPORTS NEWS : చిన్నప్పుడు నేను వివ్ రిచర్డ్స్ కి పిచ్చ ఫ్యాన్.. ఆపై నా ఫ్యాన్ మెయిల్ మొత్తం తుఫాన్ లెక్క సెహ్వాగ్ వైపు మళ్లించా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కానీ ఒకరితో నిశ్చితార్ధం మరొకరితో పెళ్లి ఎలా షాకింగ్ ఎలిమెంట్ గా భావిస్తాడో.. సరిగ్గా అదే సమయంలో.. నాకు వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ అలా షాకింగ్ ఎలిమెంట్. ఎందుకంటే నాక్కూడా అలాగే ఆడాలనిపించేది.. కాకుంటే నాకు క్రికెట్ లో అలాంటి ఆట ఆడేంత సామాజిక\ ఆర్ధిక\ కుటుంబిక\ శారీరక స్థిత ప్రజ్ఞత లేక పోవడం వల్ల నా యవ్వనంలో గొప్ప బ్యాటర్ కాలేక పోయాను కానీ.. ఒక దశలో కీపింగ్ లోకి నా ప్యాషన్ మళ్లించుకుని చిన్న పాటి గుర్తింపు తెచ్చుకున్న మాట అంతే వాస్తవం అవ్వొచ్చుగానీ..
ఇదిలా ఉంటే.. నేను ఆడాలనుకునే విధాన్ని మరింత విధ్వంసకరంగా ఇంకా చెబితే.. అంతకన్నా వైబ్రెంట్ గా చూపిస్తున్న వాడు మాత్రం రిషభ్ పంత్.. ఇదే వరల్డ్ కప్ లో అతడు పాకిస్థాన్ తో (అనుకుంటా) ఆడిన ఇన్నింగ్స్ లో కామెంటరేటర్ ఒక మాట అంటాడు.. ఈ షాట్ కి ఇంకా పేరు పెట్టలేదు.. ఇది అవుటాఫ్ సిలబస్.. పంత్ ఎక్స్ క్లూజివ్.. కింద పడి కొట్టే షాట్ అని చెప్పాల్సి ఉంటుందని అన్నాడతను..(కామెంటరేటర్) నిజంగా బౌలర్ ఆ బాల్ ఎలా వేస్తాడో తెలీదు కానీ.. దాన్ని రిషభ్ పంత్ డీల్ చేసే విధం.. మాత్రం ఎవ్వరూ ఊహించలేనిదిగా ఉంటుంది.. ఎప్పటికీ గెస్ చేయలేరు.. ఆ బ్యాట్ ని అసలు బ్యాట్ గానూ.. ఆ బాల్ ను అసలు బాల్ గానూ అతడింత వరకూ సీరియస్ గా తీసుకుందే లేదు..
అదేంటో తెలీదు గొప్ప విశ్వాసం.. గొప్ప ధైర్యం.. కొండంత ఆత్మ నిర్బరం.. ఏది అతడి మెదడ్ని బ్యాటింగ్ సమయంలో పట్టి పీడిస్తుందో తెలీదు గానీ.. వాడి(బౌలర్) సీరియాసిటీ మొత్తాన్ని తనదైన తుంటరి ఆట తీరుతో.. తుక్కు కింద కొట్టేస్తాడు.. ప్రేక్షక జనం కూడా అతడెలా టర్న్ అవుతాడో.. తన బ్యాట్ ని ఎలా మళ్లిస్తాడో.. ఆ బాల్ ఏ వైపు వెళ్తుందో మొత్తం సస్పెన్స్… ఈ స్టైల్ మీకు ఎక్కువగా ఫుట్ బాల్ లో గోల్ కొట్టేటపుడు కొందరు వాడుతుంటారు.. ఒక వైపు కొట్టినట్టు కనిపించి మరో వైపునకు దారి మళ్లిస్తుంటారు.. ఇక టెన్నిస్, బ్యాడ్మెంటన్ లో కూడా ఈ ట్రిక్ వాడుతుంటారు.. సరిగ్గా అలాంటి టెక్నిక్కే.. తన బ్యాటింగ్ లో వాడుతాడు కావచ్చు పంత్..
అబ్బబ్బబ్బ.. ఏం ట్రీట్మెంట్.. మైండ్ బ్లోయింగ్ అన్ బిలీవబుల్.. అన్న మాటలు కూడా చిన్నవైపోతున్నాయ్ అనే చెప్పాలి.. ఒక రకంగా చెబితే.. నాటి వివ్ రిచర్డ్స్, ఆ తర్వాతి కాలం నాటి వీరేంద్రుడి విధ్వంసం.. ఆపై సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకూ బ్యాటింగ్ అనగానే ఏర్పరిచిన ఒకానొక కల్చర్.. కల్ట్.. ఈ మొత్తం తనకు ఏ మాత్రం తెలీనట్టు.. ఇప్పటి వరకూ తనకెవరూ అలాంటిదొకటి ఉన్నట్టే చెప్పనట్టూ ఆడేస్తుంటాడో.. అదేంటో గానీ.. వీవీఎస్ లక్మణ్, అంతకన్నా ముందు బ్యాటింగ్ పొయిట్రీలు పిచ్ మీద రాసిన గుండప్ప విశ్వనాథ్ వంటి వారు ఇతడి షాట్ మేకింగ్ చూసి గుండె పోటు తెచ్చుకుంటారనుకుంటా.. అంత అర్ధం పర్ధం లేకుండా ఆడేస్తూ.. వాటిని సిక్స్ లు ఫోర్లుగా మళ్లించేస్తూ.. క్రికెట్ బ్యాటింగ్ లోనే కొత్త పోర్షన్ కి తనదైన వర్షన్ అద్దేస్తున్నాడు..
బేసిగ్గా ఇతడికి ఇలాంటి శైలి అబ్బడానికి కారణం.. అతడొక కీపర్ కావడం వల్ల కావచ్చు.. ఆ బాల్ ని డయ్ కొట్టి మరీ ఎలా పడుతుంటాడో.. తన బాడీని బ్యాటింగ్ ఆడేటపుడు కూడా అంతకన్నా మించిన వంపులు సొంపులు తిప్పేస్తూ.. వీరంగం ఆడేస్తుంటాడు.. అదృష్టమేంటంటే.. వాటిలో చాలా వరకూ ఫోర్లూ, సిక్స్ లూ దాటేస్తుండటంతో..
బతికి పోతున్నాడుగానీ.. లేకుంటే ఇతడికంటూ ఒక కెరీరే ఉండేది కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి.. అలాగని ఇంత సీరియస్ గా కూడా అతడెప్పుడూ ఆలోచిస్తున్నట్టే కనిపించదు..
కోహ్లీ వంటి కొందరు.. సచిన్ వంటి క్రికెట్ పెద్దల అడుగు జాడల్లో నడుస్తూ.. వారితో పోటీ పడుతూ.. ఒక్కోసారి వారితో పోలిక తెస్తూ.. ఇలా రకరకాలుగా వారినీ వీరినీ తలపిస్తూ కెరీర్ కొనసాగిస్తుంటారు.. కానీ పంత్ అలాక్కాదు.. ఇతడొక క్రికెట్ జాకీ చాన్.. ఇద్దరిదీ ఒకటే మెథడ్.. జాకీ చాన్ కి ఆల్టర్ నేట్ ఎలా ఉండదో.. రిషభ్ పంత్ బ్యాటింగ్ కి కూడా అలా సాధ్యం కాదనుకుంటా.. అతడు అతడే.. ఇతడు ఇతడే.. హీ ఈజ్ ద న్యూ సిగ్నేచర్ ఇన్ వరల్డ్ క్రికెట్ బ్యాటింగ్ హిస్టరీ అనడంలో ఎలాంటి సందేహం లేదంటాన్నేను..
ఒక క్రోనాలజీ తీసుకుంటే.. వివ్ రిచర్డ్స్ ప్రపంచ దిగ్గర బౌలర్లు ఎందరు తనకు ఎదురైనా సరే కేవలం క్యాప్ పెట్టుకుని మాత్రమే ఆయన చేసే బ్యాటింగ్ నాకు నిజంగా ఒక వండర్ గా అనిపించేది.. ఆపై పాకిస్థాన్ నట్టింటికెళ్లి వాళ్ల ఎక్స్ ప్రెస్ బౌలర్ అక్తర్ వంటి వారి బౌలింగ్ ను తుత్తునీయలు చేసిన సెహ్వాగ్ అంటే నిజంగా ఒక వండర్ గా అనిపించేది..
ఇప్పుడు రిషభ్ పంత్ ఆట తీరు చూస్తుంటే అంతకన్నా పిచ్చెక్కించేస్తుంది.. ఏ క్రికెట్ మేథావి కూడా ఊహించని వైవిధ్యపూరిత\ విధ్వంసకర షాట్లు పరిచయం చేస్తున్నాడు పంత్.. ఒక టోర్నీలో అప్పుడప్పుడు మాత్రమే పంత్ తనదైన స్టైల్లో ఒక రిమార్కబుల్ ఇన్నింగ్స్ ఆడొచ్చుగాక.. అది మాత్రం మాస్టర్ పీస్.. అవుతోంది! మాయా బజార్ సినిమా రచయిత.. మాటలు ఎవ్వరూ పుట్టించకుంటే కొత్తవెలా పుడతాయ్ అన్నట్టు.. రిషభ్ పంత్ కూడా అంతే.. కొత్త కొత్త షాట్లు అప్పటికప్పుడు.. తనకు కూడా తెలీకుండా..
తన ఊహలకే అందని విధంగా.. అలవోకగా పుట్టిస్తుంటాడంతే… ఒక సారి కాళ్ల సందుల్లోంచి ఫోర్ కొడితే చూసి ఆశ్చర్య పోవడం సగటు క్రికెట్ అభిమాని వంతు అవుతుందంటే అతిశయం కాదు..
ఇదే 2024- టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో కప్పు ఒడిసి పట్టింది సూర్యకుమార్ క్యాచ్ అయి ఉండొచ్చుగాక.. సూర్యకుమార్ యాదవ్ కి బ్యాటింగ్- 360 అనే మరో పేరుండొచ్చుగాక..
నాకు ఇప్పటికీ రిషభ్ పంత్ ఇన్నింగ్సే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.. పంత్ కి నేనంత పిచ్చ ఫ్యాన్ పంత్ కీ నా ఆలోచనా ధోరణికి అందులోని విభిన్నతకీ వైవిధ్యానికీ ఏమైనా పొంతన ఉందేమో తెలీదు కానీ.. పంత్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరేట్ క్రికెట్ గాడ్ అనేంత మాటలు అనలేనుగానీ నా ప్రియాతి ప్రియమైన క్రేజీ రాబర్ట్ మాత్రం అతడే..
హేట్సాఫ్ పంత్ ఐ లవ్ యువర్ బ్యాటింగ్ యాటిట్యూడ్.. ఫర్ ఎవర్!!! దట్పాల్ ……
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్