ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ ‘భోళా శంకర్’ లో వుంటాయి : చిత్ర యూనిట్
మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్ లో కనిపించడం ఎప్పుడూ కన్నుల పండువగా ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ లో మెగాస్టార్ చిరంజీవిని పవర్-ప్యాక్డ్ రోల్ లో ప్రజంట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈరోజు లాంచ్ చేశారు.
33 మందిని దారుణంగా చంపిన వ్యక్తి కోసం కోల్‌కతా పోలీసులు వెతుకుతున్నారని చెప్పే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో తన స్వాగ్, స్టయిల్ తో అదరగొట్టారు. డెన్‌లో గూండాలను చితకొట్టి “షికార్ కొచ్చిన షేర్ ని బే…” అని చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా పేలింది.
“ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే… అన్ని ఏరియాలు అప్నా హై… నాకు హద్దుల్లేవ్… సరిహద్దుల్లేవ్… 11 ఆగస్ట్ దేఖ్‌లేంగే…” అంటూ మెగాస్టార్ చెప్పిన చివరి డైలాగ్ ప్రేక్షకులని అలరించింది.
మెహర్ రమేష్ , చిరంజీవిని వింటేజ్ మాస్ అవతార్‌లో చూపించారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. టీజర్‌లో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ పాత్రలను కూడా పరిచయం చేశారు.
డడ్లీ తన అద్భుతమైన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్స్ టార్డినరిగా వుంది . థీమ్ సాంగ్ పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇస్తుంది. ఓవరాల్ గా టీజర్ ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచింది.