Entertainment బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తన మనవరాలు ఆరాధ్య పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఆరాధ్య పై తనకున్న ప్రేమను తెలుపుతూ.. తనను ఎంతగా మిస్ అవుతున్నారో చెప్పకు వచ్చారు..
కౌన్ బనేగా కరోడ్పతి షోలో బిగ్ బి అమితాబచ్చన్ కు తన మనవరాలు ఆరాధ్య బచ్చన్ అంటే చాలా ఇష్టం అని.. కానీ తనను ఎంతగానో మిస్ అవుతున్నానని అన్నారు. నిజానికి ఆరాధ్యతో నాకు చాలా సమయం గడపాలని ఉంటుంది. కానీ ఉదయాన్నే నేను ఏడున్నరకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తా.. ఆ తర్వాత ఆరాధ్య స్కూల్ కి వెళ్ళిపోతుంది. సాయంత్రం వచ్చాక తన హోం వర్క్ చేసుకుంటుంది. ప్రతీ రోజు నేను ఇంటికి వెళ్లేటప్పటికీ రాత్రి 10 దాటుతుంది. ఆ సమయానికి తను నిద్రపోతుంది. కేవలం సెలవు రోజుల్లో మాత్రమే నేను తనతో ఉండగలుగుతా. మిగిలిన సమయాల్లో తనను చాలా మిస్ అవుతా.. అంటూ చెప్పకు వచ్చారు. అంతేకాకుండా ఆరాధ్యకు కోపం వచ్చినప్పుడు చాక్లెట్స్ ఇచ్చి బుజ్జగిస్తానని అన్నారు.. అలాగే ఆరాధ్యకు ఇష్టమైన కలర్ పింక్ అని.. ఆ కలర్ లో హెయిర్ బ్యాండ్స్, టెడ్డీబేర్స్ ఏమిచ్చినా ఆమె వెంటనే కూల్ అయిపోయి మాట్లాడేస్తుందని అన్నారు..
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ 2011 లో జన్మించిన సంగతి తెలిసిందే.. ఈమె ప్రస్తుతం ముంబైలో ఉన్న ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది.