Entertainment బిగ్బాస్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు సోహెల్. అయితే ఆయన తాజాగా తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకోస్తూ తన వ్యక్తిగత జీవితం గురించి తెలిపాడు.. ఒక అమ్మాయిని ప్రేమించానని అలాగే ఎగ్జామ్స్ లో ఎప్పుడూ కాపీ కొట్టే పాస్ అయ్యే వాడినని తెలిపాడు కొన్ని పరిస్థితుల్లో డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ కూడా చేసుకోవాలి అని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు..
“నేను 8వ తరగతి చదువుతున్నపుడు చిరంజీవి గారి ‘కొడితే కొట్టాలిరా..’ పాటకు డాన్స్ వేశా. అప్పుడు ఓ నేపాలీ అమ్మాయి వచ్చి మాట్లాడింది. తనని ఇష్టపడ్డా. నేను అన్ని ఎగ్జామ్స్ కాపీ కొట్టి పాస్ అయ్యా.. డెస్ర్ వెనకాల రాసుకుని.. పరీక్షలకు వెళ్లేవాడిని అలాగే అన్ని డిగ్రీ పరీక్షలు పాస్ అయిపోయా..అలాగే నేను చాలా సున్నితమనస్కుడిని. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ఓపెన్ హర్ట్ సర్జరీ అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు రోజూ అడుగుతుండే వాళ్లు. ఎప్పుడు సెటిల్ అవుతావు? అని అడిగే వాళ్లు. నాకేమో సినిమాలంటే ఇష్టం. అప్పటికీ రెండు సినిమాల్లో నటించా కానీ హీరోగా గుర్తింపు రాలేదు. ఇంట్లోనేమో ఉద్యోగమంటూ ఒత్తిడి.. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి సూసైడ్ ఆలోచన వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరడానికి వెళ్లి కూడా నా గమ్యం ఇది కాదు అని వెనక్కి వచ్చేశాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. కానీ నేను ఇలా ఉండడానికి మా నాన్న ఎన్నో త్యాగాలు చేశారు… వాటన్నిటిని నేను ఎప్పటికీ మర్చిపోను ” అంటూ చెప్పకు వచ్చాడు..