Birthday celebrations of BRS MLC Kalvakuntla Kavita,Telangana Politics,Telangana News,Latest Telugu News,Telugu World Now

MLC Kalvakuntla Kavita : ఘనంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బుధవారం నాడు ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న అర్ధరాత్రి బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే, తన జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *