Political News : తెలంగాణ రాష్ట్రంలో నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు నిప్పులు చిమ్ముతున్నారు రాజకీయ నాయకులు. గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అభివృద్ధి పనులు చేసింది అంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు టీవీలో బహిరంగ సభలో చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల దగ్గర పడడంతో ఒకరిపై ఒకరు ఎద్దేవా చేసుకుంటూ మీరు అంత చేశారు మేమంతా చేశామంటూ ఫైర్ అవుతున్న విషయం తెలిసింది. కాగా తెలంగాణలో రాజకీయం కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
నిన్న మొన్నటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. అలానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ని కలవడంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చర్చకు దారి తీసింది. అయితే తాజాగా బిజెపి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటించడంలో తెలంగాణ రాజకీయంలో ఇంకాస్త వేడెక్కుతుంది బిజెపి పార్టీ నాయకులు తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలో పర్యటిస్తున్నారని టిఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించడం మనం వింటున్నాం.
ఈరోజు జేపీ నడ్డా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ముఖ్యఅతిథిగా రావడం జరుగుతుంది. కాగా జేపీ నడ్డా క్రికెట్ క్రీడాకారి మిథాలీరాజ్ ను అలానే టాలీవుడ్ హీరో నితిన్ కలవడంతో ఇంకాస్త వేడెక్కింది తెలంగాణ రాజకీయం. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు జేపీ నడ్డా. రాత్రికి నోవాటెల్ లో హీరో నితిన్ కలవనున్నారు ఆ తర్వాత రాత్రికి7 గంటలకు ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు.