బీసీ మరియు దళిత రాజకీయాలకు ముగింపు పలికే లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ లక్ష్యం కట్టుకుందని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోషలిస్ట్ ఫ్యామిలీ (మహాకూటమిలో) చేరాలనే తీసుకున్న నిర్ణయం బీజేపీ పార్టీకి చెంప దెబ్బలాంటిదని ఆయన పేర్కొన్నారు. అంతేకాక బీజేపీ పార్టీ ప్రాంతియ పార్టీలను బెదిరిస్తూ భయాభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తేజస్వీ యాదవ్ సోనియా గాంధీతో ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఆర్జేడీలో కూటమిలో చేరాలనే నిర్ణయంతో నితీష్ కుమార్ తన సిద్ధాంతాలను రక్షించుకున్నారన్నారు. మేమంతా ఒకరిపై ఒకరం ఆరోపణలు, విమర్శలు చేసుకున్నా తామంతా ఒకటేనని మేమందరం సోషలిస్టులం అన్నారు. ప్రాంతియ పార్టీలు ఎక్కువగా బీసీ, దళితులకు చెందినవని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా వెనకబడిన కులానికే చెందిన వారని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, పేద ప్రజల సంక్షేమం, మతపరమైన శక్తులకు వ్యతిరేకంగా మా నాన్న లాలూప్రసాద్ యాదవ్ తన జీవితాంతం పోరాటం చేశారని గుర్తు చేశారు. రాం విలాస్ పాశ్వ¯Œ పార్టీని కూడా బీజేపీ పార్టీ చీల్చిందన్నారు. ప్రాంతియ పార్టీలు లేకుంటే దేశంలో ప్రతి పక్షాలు లేనట్లేనని అది ప్రజా స్వామ్యాన్ని సర్వ నాశనం చేస్తోందన్నారు. ప్రజా పాలనను విస్మరించి కేవలం కులమతాల గొడవలు, పార్టీలలో చిచ్చు పెట్టడమే బీజేపీ స్వాభావమని ధ్వజమెత్తారు.
నీతీష్ కుమార్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు దేశం మొత్తం ఇదే జరుగుతోందని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీహర్‌లో బీజేపీ వ్యతిరేఖ శక్తులన్నీ ఒకే గూటికి చేరాయన్నారు. అయితే ఈ క్రమంలో ఓ విలేకరి రానున్న ఎన్నికల్లో విపక్షాల తరఫుని ప్రధాని అభ్యర్థి నితీష్ కుమారా అని ప్రశిస్తే .. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీలు ఇస్తున్న బీజేపీ మాటలు ఏమయ్యాయి ఎదురు ప్రశ్నించారు. మేము ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తామని అయితే దానికి కొంత సమయం పడుతోంది కచ్చితంగా మేమిచ్చిన మాటను నిలబెడుతామన్నారు. ఏ ఒక్కరోజైనా బీజేపీ పార్టీ మతాల గురించి మాట్లాడకుండా ఉంటుందా.. ప్రజా పాలన కన్నా వారికి కులమతాలపైనే ఎక్కువ దష్టి సారిస్తున్నారని తేజస్వీ యాదవ్ ఆరోపించారు.