నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం ఒక అద్భుతమైన బౌద్ధ ప్రపంచమని శ్రీలంక కళాకారులు గామిని జయ సంగే, అమితాబ్ ఉదయ్ లు తెలిపారని బౌద్ధ విషయా నిపుణులు చరిత్రకారులు బుద్ధ వనం కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు శ్రీలంకకు చెందిన కళాకారులు సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా బుద్ధ వనం కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి శ్రీలంక కళాకారులకు బుద్ధ చరిత వనం ,జాతకవనం, స్తూపవనం, ధ్యాన వనముల గురించి వివరించారు. ధ్యాన వనంలోని 27 అడుగుల శ్రీలంక అవకన బుద్ధుని విగ్రహాన్ని, స్థూపా వనంలోని శ్రీలంక అనురాధపూర్ లోని స్తూప నమూనాని చూసి శ్రీలంక దేశ కళాకారులు పులకించిపోయారని ఆయన తెలిపారు.
బౌద్ధ వారసత్వ సంపదను 2700 సంవత్సరాల క్రితం నాటి బౌద్ధ శిల్ప సంపదను కనులకు కట్టినట్లుగా నాగార్జునసాగర్ బుద్ధ వనం లో నిర్మించిన తెలంగాణ ప్రభుత్వాన్ని, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ను వారు అభినందించినట్లుగా తెలిపారు. వీరితోపాటు బుద్ధవనం డిజైన్ ఇన్చార్జ్ శ్యాంసుందర్రావు తదితరులు ఉన్నారు.