Baby Movie : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ మూవీకి కథని అందించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. SKN నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రెజెంట్ లవ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కింది. ట్రైయాంగులర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ నేడు జులై 14న ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి షోతోనే మంచి సక్సెస్ టాక్ తెచ్చుకొని హిట్ దిశగా వెళ్తుంది.
ఇది ఇలా ఉంటే, ఈ మూవీ గురించి ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బీవీఎస్ రవి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. “మీరు ఇడియట్స్..? దురదృష్టవంతులు..? అనేది నాకు అర్ధంకావడం లేదు ఈ మూవీని సమ్మర్ లోనే రిలీజ్ చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ చూసేవాళ్లు” అంటూ మూవీ టీంని కొంచెం డిఫరెంట్ గా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాని ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాల్సింది. కానీ మూవీ టీం ఎందుకో పోస్ట్‌పోన్ చేసింది.అంటూ చెప్పుకొచ్చారు .
ప్రీమియర్‌ను వీక్షించిన తరువాత విజయ్, రాశీ ఖన్నాలు మీడియాతో మాట్లాడగా.. రష్మిక మాత్రం మీడియాకు థంబ్స్-అప్ సింబల్ చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బేబీ సినిమా చూసి థియేటర్ లో నుంచి బయటకి వచ్చిన కన్నీళ్లు తుడుచుకుని కాస్త ఎమోషనల్‌గానే కనిపించింది. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.